Karan Arjun: సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ టైటిల్ రోల్స్ ప్లే చేసిన సినిమా ‘కరణ్ – అర్జున్’. రాకేశ్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 30 యేళ్ళ క్రితం 1995 జనవరి 13న విడుదలైంది. పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా 75 వారాలపాటు ప్రదర్శితమై రికార్డ్ సృష్టించింది. సల్మాన్ – షారూఖ్ ఖాన్ నటించిన ఈ తొలి చిత్రం ఇప్పుడు మళ్ళీ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. రాఖీ, కాజోల్, మమతా కులకర్ణి, అమ్రిష్ పురి ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు దశాబ్దాలు గడిచినా… ఇటు సల్మాన్, అలు షారూఖ్ ఖాన్ ఇంకా బాలీవుడ్ లో అగ్ర కథానాయకులుగా రాణిస్తుండటం విశేషం. ‘కరణ్ అర్జున్’ మూవీ నవంబర్ 22న జనం ముందుకు వస్తోంది.
