Kubera: ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. ‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను నిర్ణయించేశారు. రశ్మిక ఇందులో హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నాగార్జున, ధనుష్, రశ్మిక ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ కు మంచి స్పందన లబించింది. గతేడాది రిలీజ్ కావలసిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 20న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా తర్వాత ధనుష్ నటించిన ‘సార్, రాయన్’ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ అనే మూవీ రూపొందిస్తున్నాడు. దీని రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఇది విడుదల కానుంది. దీని తర్వాత ‘కుబేర’ను రిలీజ్ చేస్తారట. అమిగోస్ క్రియేషన్స్ తో కలసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.