SEETAKKA: రైతుల సంక్షేమంపై జూలై 8న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చించేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ, “కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ అర్థం కాలేదా?” అంటూ విమర్శలు గుప్పించారు.
ప్రెస్‌క్లబ్‌నా? అసెంబ్లీనా?
శనివారం ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడిన సీతక్క, “రైతుల సమస్యలపై చర్చ అసెంబ్లీలో జరగాలి. ప్రెస్‌క్లబ్‌కు రావాలంటారా? ప్రజలు మీలను ప్రెస్‌మీట్లు పెట్టడానికి ఎన్నుకోలేదు,” అని సూటిగా ప్రశ్నించారు.
‘డెడ్‌లైన్’ వ్యాఖ్యలపై ఎద్దేవా
కేటీఆర్ వేసిన 72 గంటల డెడ్‌లైన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “డెడ్ అయిన పార్టీకి డెడ్‌లైన్‌లు ఏంటీ?” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “నీ డెడ్‌లైన్ కోసం రాష్ట్రం ఎదురు చూడదు,” అని తేల్చి చెప్పారు.
కేటీఆర్‌ను సీతక్క ఉద్దేశపూర్వకంగా కొట్టిపారేశారు
“నీ సొంత చెల్లే నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో చర్చిద్దాం అంటే భయమెందుకు? ప్రతిపక్ష నేత అయిన నీ నాన్నను కూడా చర్చకు రావాలని ఆహ్వానించాం,” అంటూ సీతక్క ఘాటుగా విరుచుకుపడ్డారు.