Kothapallilo Okappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా టీజర్ గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సరదా హాస్యాన్ని ఆవిష్కరిస్తూ విడుదలైంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా గందరగోళం, హాస్యాన్ని రేకెత్తిస్తున్నట్లు తెలుస్తుంది. సీనియర్ నటుడు బెనర్జీ, యువ నటుడు మనోజ్‌తో పాటు రవీంద్ర విజయ్, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణా పరుచూరి తొలి దర్శకురాలిగా, తన పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం, వెరున్ ఉన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. జూలై 18న విడుదల కానున్న ఈ చిత్రం స్థానిక హాస్యంతో ప్రేక్షకులను అలరించనుంది. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
