Satya Kumar: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తన మాతృభాష, భాషా ప్రాముఖ్యతపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సత్యకుమార్ చిన్నారులు భాషను ఎలా నేర్చుకుంటారనే విషయంపై చెప్పుతూ, అనుకరణ, గమనిక ద్వారా చుట్టూ ఉన్నవారి నుంచి భాష అవగాహన పొందుతారని వివరించారు. మాతృభాష వ్యక్తిగత సృజనాత్మకతకు, తెలివితేటలకు పునాది అవుతుందని చెప్పారు
సత్యకుమార్ తన కుటుంబం మహారాష్ట్రలోని శంభాజీ సంస్థానం నుంచి దాదాపు 400 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశానికి వలసవచ్చిందని తెలిపారు. వారి మాతృభాష మరాఠీ అయినప్పటికీ, తెలుగు వాతావరణంలో పెరిగిన కారణంగా, తెలుగు భాషే తన ఆలోచనలకు, వ్యక్తీకరణకు కేంద్రంగా మారిందని వివరించారు.
తనకు మరాఠీతో పాటు కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలు వచ్చినా, ఆ భాషల్లో మాట్లాడడం కష్టతరంగా ఉంటుందని, కానీ తెలుగులో మాట్లాడటం, ఆలోచించడం సహజంగా జరిగిపోతుందని తెలిపారు.