Sardaar Gabbar Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అట్టర్ ప్లాప్ చిత్రాల్లో భారీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఊహించని హైప్ వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో కూడా రిలీజ్ కి వచ్చింది. పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ చిత్రాన్ని డాకు మహారాజ్ దర్శకుడు బాబీ తెరకెక్కించారు. అయితే అప్పట్లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇపుడు మళ్ళీ ట్రెండింగ్ లో కనిపిస్తుండడం విశేషం.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇలానే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లోని సంగీత్ సీక్వెన్స్ పై కూడా ట్రోల్స్ లా స్టార్ట్ అయ్యాయి కానీ ఇవి కాస్తా పవన్ అభిమానులు పాజిటివ్ యాంగిల్ లో మార్చేసుకొని వాటిని కూడా వారు ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా వారు కూడా పలు ఎడిట్స్ చేసి వదులుతుండడం గమనార్హం. దీనితో ఇలా గత కొన్ని రోజులు నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ ఎడిట్స్ తోనే సోషల్ మీడియా మొత్తం నిండిపోయిందని చెప్పాలి.
