Gamblers: ‘మ్యాడ్ స్క్వేర్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగీత్ శోభన్ తాజాగా ‘గ్యాంబ్లర్స్’ అనే మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నాడు. ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రశాంతి చారులింగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘యుద్ధం, జూదం ఒక్కటే! యుద్ధం ఎక్కడ మొదలెట్టాలో, జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి’ అనే డైలాగ్‌తో టీజర్ ఆసక్తి రేపుతుంది. పేకాటలో నిష్ణాతుడైన పాత్రలో సంగీత్ కనిపిస్తూ, ఐదుగురు మిస్టరీ వ్యక్తుల వేట, డైమండ్ చుట్టూ తిరిగే ఉత్కంఠ ఘటనలతో టీజర్ ఆకట్టుకుంటుంది. ఎస్‌కే చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ కీలక పాత్రలో మెరుస్తున్నాడు. అతని పాత్ర టీజర్ చివరిలో మర్మమైన ట్విస్ట్‌ను అందిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టీజర్ సూచిస్తోంది.
