Sandeep Reddy Vanga: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో సినిమాల్లో చూపించే హింసపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు నెటిజన్లు, సినీ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ‘యానిమల్’ సినిమాలో హీరో తరగతి గదిలోకి ఆయుధంతో చొరబడే సీన్‌ను ప్రస్తావిస్తూ.. ఇలాంటి చిత్రాలే నేరస్థులకు ప్రేరణగా మారుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సినిమాలను బలిపశువులను చేయకండి.. సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం
ఎవరైనా అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడినప్పుడు.. మన మొదటి ప్రతిస్పందన బాధితుల పట్ల సానుభూతి చూపడం, సమస్యకు గల విస్తృత కోణాలను అర్థం చేసుకోవడమే కావాలి. అంతేకానీ, సినిమాను చాలా సులువుగా ఒక బలిపశువుగా మార్చడం కాదు. మీ ఆందోళన బాధితులు లేదా వారి కుటుంబాల పట్ల కాదని, ఒక భయానక విషాదాన్ని వాడుకుని మీ వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.ముఖ్యంగా అవకాశాలు లేక నిరాశలో ఉన్న కొందరు ఫెయిల్డ్ నటీనటులు, కొంతమంది దర్శకులు, నిర్మాతలు, పరాన్నజీవులుగా మారిన కొందరిని ఉద్దేశించి నేను ఇది చెబుతున్నా. ఇతరుల పనిని విమర్శించే అవకాశం రాగానే మీరంతా హఠాత్తుగా సామాజిక సంస్కర్తలుగా మారిపోతుంటారు. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి.. అవకాశవాదం కాదు. ఆ రెండింటి మధ్య తేడాను తెలుసుకోండి.”
వివాదానికి కారణమైన ‘యానిమల్’ సీన్ విమర్శలు
సినిమా అనేది కేవలం మాధ్యమం మాత్రమే: విశ్లేషకుల మాట
