Salman Khan: బాలీవుడ్ లో తెలుగు సినిమా డామినేషన్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో నటించటానికి ఎంతో ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాప్ స్టార్స్ తెలుగు సినిమాలలో నటించగా మరి కొందరు నటించబోతున్నారు. ‘కల్కి’లో అమితాబ్ దే లీడ్ రోల్. ఇక బాబీ డియల్ వరుసగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ‘కంగువ’లో కనిపించిన ఆయన బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. రజనీకాంత్ ‘కూలీ’లో ఆమీర్ ఖాన్ క్యామియోలో కనిపించనుండగా రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడట. చెర్రీ, సల్మాన్ మంచి ఫ్రెండ్స్ కూడా.
Salman Khan: గతేడాది చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ క్యామియోలో కనిపించాడు సల్మాన్. ఇప్పుడు బుచ్చిబాబు, చరణ్ స్పోర్స్ీవ డ్రామాలోనూ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే 22న డల్లాస్ లో జరగబోయే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళనున్నాడు. అంతే కాదు యుఎస్ లో ఈ సినిమా బుకింగ్స్ ను శ్లోక ఎంటర్ టైన్ మెంట్స్ నెల రోజుల ముందే అంటే 14వ తేదీ నుంచే ఓపెన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ‘పుష్ప2, దేవర, కల్కి 2898ఎడి’ ఓపెనింగ్ బుకింగ్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ‘గేమ్ ఛేంజర్’ కూడా చేరుతుందేమో చూద్దాం.