Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ ఫలితంగా తనకు పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. తాను పడిన కష్టంతో పోల్చితే, ఆ స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదని అన్నారు. ప్రశాంత్ నీలే తెరకెక్కించిన ‘ఉగ్రం’, ‘కేజీఎఫ్’ను పోలి ‘సలార్’ ఉందని ప్రేక్షకులు భావించడమే దానికి కారణం. అయితే ఆ పొరపాట్లు పునారవృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ‘సలార్-2’చేస్తానని ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ మూవీ చేయబోతున్నాడు. ఇది 2026 జనవరి 9న విడుదల కానుంది.