Saif Ali Khan Attacked: నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో విచారణ నిమిత్తం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన నిందితుడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ముంబై పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. అంతకుముందు, సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు విచారణ కోసం తీసుకువచ్చారని వార్తా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అతని పేరు షాహిద్ అని పోలీసులు చెప్పారు. ఇతనిపై ఇప్పటికే 5 హౌస్ బ్రేక్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దానికి, సైఫ్ అలీఖాన్ పై దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, మీడియా రిపోర్ట్స్ ప్రకారం, జనవరి 14 మధ్యాహ్నం 2:42 గంటలకు, షారుక్ ఖాన్ ఇంటి వెలుపల ఒక వ్యక్తి ఇంటిని రెక్కీ చేస్తూ కనిపించాడు. అతను ఇనుప నిచ్చెనను ఉపయోగించి పీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వీడియోల్లో కనిపించాడు. అయితే, బంగ్లాకు సంబంధించి, ముంబై బాంద్రా జోనల్ DCP మాట్లాడుతూ, ఈ విషయంలో ఇప్పటివరకు ఏమీ వెలుగులోకి రాలేదని చెప్పారు. వదంతులు ప్రచారం చేయవద్దని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీనా కపూర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. దీంతో పాటు కొద్ది రోజుల క్రితం వరకు సైఫ్ ఇంట్లో పనిచేసిన కార్పెంటర్‌ను కూడా విచారించారు.
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి సైఫ్..
ఇది కూడా చదవండి: Internet Users In India: రోజుకు 94 నిమిషాలు వాడితే చాలు.. 2025లో ఇంటర్నెట్ వాడే సంఖ్య 90 కోట్లు దాటుతుంది
Saif Ali Khan Attacked: ముంబైలోని లీలావతి ఆస్పత్రి చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, సీఓఓ డాక్టర్ నీరజ్ ఉత్తమని శుక్రవారం మాట్లాడుతూ సైఫ్‌ను ఐసీయూ నుంచి ఆస్పత్రిలోని ప్రత్యేక గదికి తరలించినట్లు తెలిపారు. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.
బుధవారం అర్థరాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కత్తితో దాడి చేశాడు. మెడ, వీపు, చేతులు, తలతో సహా ఆరు చోట్ల కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సైఫ్ వెన్నుపాములో కత్తి ముక్క తగిలిందని, రక్తం కూడా కారుతున్నదని లీలావతి ఆస్పత్రి సీఓఓ డాక్టర్ నీరజ్ ఉత్తమని తెలిపారు. వెన్నుముకలో దిగిన కత్తిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సైఫ్ వెన్నెముకలో కత్తి 2 మి.మీ దిగిందని.. అది మరింత లోతుగా దిగి ఉంటే వెన్నెముకకు విపరీతమైన డామేజ్ అయి ఉండేదని డాక్టర్లు చెప్పారు.