Saidi Arabia: సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన మార్పుగా భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియాలో 73 ఏళ్లుగా మద్యనిషేధం అమలులో ఉన్నది. ఆ నిషేధాన్ని ఎత్తివేసేందుకు ఆ దేశం తాజాగా నిర్ణయం తీసుకున్నది.
Saidi Arabia: 1952లో అప్పటి సౌదీ అరేబియా దేశ రాజు ఇబ్న్ సౌద్ మద్యం అమ్మకాలపై సంపూర్ణ నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటికీ అది అమలులోనే ఉన్నది. ఈ నిర్ణయంతో అక్కడ సంపూర్ణ మద్యపానం నిషేధించబడింది. తాజాగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన విజన్ 2030 ప్రణాళికలో భాగంగా 73 ఏళ్ల నుంచి అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Saidi Arabia: అయితే ఈ నిర్ణయం ప్రకారం సుమారు 600 వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో నియంత్రిత మద్యం అమ్మకాలు, పరిమిత వినియోగానికి అనుమతి లభించనున్నది. అది కూఆ 2026 సంవత్సరం నుంచి అమలవుతుందని సౌదీ ప్రభుత్వ వర్గాల ద్వారా వార్తలు వెలువడ్డాయి. మద్యం అమ్మకాలకు కఠినమైన లైసెన్సింగ్ విధానాన్నితీసుకొస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
Saidi Arabia: రియాద్ ఎక్స్‌పో, ఫిఫా ప్రపంచకప్ సహా పలు అంతర్జాతీయ ఈవెంట్స్ కు ఈ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. అదే విధంగా ప్రపంచ విపణిలో దేశాన్ని మరింత ఆధునికత వైపు తీసుకెళ్లేందుకు ఆ దేశ ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలపై సడలింపు తేవాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.