Mahanadu 2025: మహానాడు సందర్బంగా కడప జన సంద్రంగా మారింది. మహానాడు ప్రాంగణం పసుపు సముద్రంలా కాంతులెక్కింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్‌లు హాజరయ్యారు. ప్రాంగణానికి చేరుకున్న వెంటనే నేతలు, కార్యకర్తలను లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. కార్యకర్తలు “జై చంద్రబాబు, జై లోకేష్” అంటూ నినాదాలు చేశారు. మహానాడు ప్రాంగణంలో సభ్యత్వ నమోదు జరుగుతుండగా, సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన తిలకించారు.
