RGV

RGV: ఇంతకంటే ఏమి చెప్పలేను.. రామ్ గోపాల్ వర్మ

RGV: చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబయి అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే, వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కూడా జారీ చేసింది. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ కంపెనీ పేరుతో వర్మపై ఫిర్యాదు చేయగా, అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఈ కేసులో వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు ప్రకారం, రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించనట్లయితే, వర్మకు మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఈ తీర్పు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నా మీద అంధేరీ కోర్టు విధించిన శిక్షకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఏడేళ్ల క్రితం నాటి విషయం. నా మాజీ ఉద్యోగితో ₹2.38 లక్షల వివాదానికి సంబంధించినది. నా న్యాయవాదులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసు కోర్టులో ఉండటంతో దీని గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను,” అంటూ వర్మ పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maharastra: కౌన్ బ‌నేగా మ‌హారాష్ట్ర సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *