Renu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?

Renu Desai: వీధి కుక్కలను చంపడంపై సినీనటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తున్నవారికి పిచ్చి పట్టినట్టుందని ఆమె వ్యాఖ్యానించారు. వంద కుక్కల్లో ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేయాలనే ఆలోచన ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు.

కేవలం కుక్కల కారణంగా చనిపోయిన వారికే ప్రాణం ఉందా అని రేణూ దేశాయ్ మండిపడ్డారు. రోడ్డుప్రమాదాల్లో, దోమల కారణంగా మరణించిన వారి ప్రాణాలు విలువలేనివేనా అని ఆమె ప్రశ్నించారు.

ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. సమస్య ఏదైనా, దానికి పరిష్కారం పేరుతో జంతువులను చంపడం పూర్తిగా దారుణమని ఆమె తీవ్రంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *