High court: హైదరాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కలిపి విచారించింది.
ఈ పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరఫున ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలుపబడింది. అదే సమయంలో పిటిషనర్లు ప్రభుత్వ కౌంటర్‌కు రిప్లై కూడా సమర్పించారు.
ఈ రిప్లైకు రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని ప్రభుత్వ అటార్ని జనరల్ అభ్యర్థించారు. దీనిని కోర్టు ఆమోదించింది. ఫిబ్రవరి 20వ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయాలని ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.
