RC 16: RC 16 పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిగా వర్క్ చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. రానున్న ఆగస్టు లోగా షూటింగ్ ఫినిష్ చేయాలని పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్.
ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన యూనిట్ తిరిగి మరల వర్క్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో జరుగుతున్న షూట్ లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో చిత్ర హీరో రామ్ చరణ్,హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు సీనియర్ నటీనటులపై సీన్స్ షూట్ చేస్తున్నారు.
Also Read: Dil Ruba: ఒకరోజు ముందుగానే దిల్ రుబా ప్రీమియర్స్!
సినిమాలోని కీలకమైన క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన షాట్స్, పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ప్రైజ్ డిస్టిబ్యూషన్ వంటి ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.