Plastic Currency: నకిలీ కరెన్సీ నోట్ల సిండికేట్‌ను అరికట్టడంతో పాటు సరిహద్దు దేశాల నుంచి జరిగే ఆర్థిక కుట్రలను భగ్నం చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సంచలన అడుగులు వేస్తోంది. దేశంలోకి త్వరలోనే సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. భారత రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ (ప్రైవేట్) లిమిటెడ్’ (BRBNMPL) పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) టెండర్లను ఆహ్వానించింది. జాతీయ భద్రతను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ.. చైనా, పాకిస్తాన్‌లకు సంబంధించిన ఏ సంస్థ కూడా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఈ ప్రక్రియలోకి రాకుండా ఆర్బీఐ కఠినమైన నిబంధనలను నిర్దేశించింది.
చైనా, పాక్ కంపెనీలకు నో ఎంట్రీ – జంతువుల కొవ్వు నిషేధం..
భారీగా పాలిమర్ షీట్ల సేకరణ..
రేసులో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు..
తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు?..
సాధారణ కాటన్ పేపర్ నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు త్వరగా చిరిగిపోవు, నీళ్లలో తడవవు మరియు ఎక్కువ కాలం మన్నుతాయి. అందువల్ల అత్యధికంగా చలామణిలో ఉండే రూ.10 మరియు రూ.20 డినామినేషన్లలో ముందుగా ప్రయోగాత్మకంగా పాలిమర్ నోట్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సమాచారం.
