Vijay Deverakonda

Vijay Deverakonda: సందీప్ పిలిచినప్పుడు రాకపోతే బతికుండీ వేస్ట్

Vijay Deverakonda: ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా, వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘రోమాంచకం’ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరై సందడి చేశారు.

 సందీప్ పిలిస్తే రాకపోతే బతికుండీ వేస్ట్..
తనకు ఈ స్థాయి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది సందీప్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ అని విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నారు. “థియేటర్‌లో ‘భద్రకాళి పిక్చర్స్’ అనే బోర్డు పడిన ప్రతిసారీ నాకు ‘అర్జున్ రెడ్డి’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది. అలాంటి సందీప్ పిలిచిన తర్వాత నేను రాకపోతే బతికుండీ వేస్ట్” అని అన్నారు.
‘పెళ్లి చూపులు’ సినిమా కూడా అప్పుడు రిలీజ్ కాలేదు..అప్పుడు అర్జున్ రెడ్డి సెట్స్ లో ఒకవేళ మన సినిమా ఫ్లాప్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇక బ్యాగులు సద్దుకోవడమేనా  అంటూ సందీప్, తాను మాట్లాడుకున్న పాత రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.
సుమంత్ ప్రభాస్‌కు విజయ్ ఇచ్చిన భరోసా..
సుమంత్ ప్రభాస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఏదైనా ఈవెంట్‌లో నీకు ఎవరూ తెలియకపోయినా, నేను అక్కడ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా నా దగ్గరికే వచ్చేయ్” అని ధైర్యం చెప్పారు.
“నీ మొదటి సినిమా ‘మేమ్ ఫేమస్’ ప్రమోషన్స్‌కి పిలిచినప్పుడు నా దగ్గర నుంచి ఎలా కంటెంట్ తీసుకున్నావో నాకే అర్థం కాలేదు ఒక్క పక్కన మొత్తం డప్పుల సౌండ్స్ వస్తుంటే నాతో ఏదో చేపించారు. రౌడీ వేర్ ఆఫీస్ వద్ద నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు ఏదో ఒకటి సాధిస్తావనిపించింది. నీ కళ్లలో ఏదో చేయాలనే కోరిక, కసి స్పష్టంగా కనిపించాయి అంటూ సుమంత్‌ను అభినందించారు.
రష్మిక ఆరోగ్యం & ‘రణబలి’ అప్‌డేట్:
వేదికపై అభిమానులు “రష్మిక వదిన ఎలా ఉంది?” అని గట్టిగా అరుస్తూ సందడి చేయడంతో విజయ్ నవ్వుతూ సమాధానమిచ్చారు. షూటింగ్‌లో జరిగిన చిన్న గాయం నుంచి రష్మిక ప్రస్తుతం వేగంగా కోలుకుంటోందని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ సమయాన్ని గడుపుతోందని తెలిపారు.
“మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘రణబలి’ సినిమా తర్వాత చూద్దురు గానీ.. ముందుగా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్న ‘రోమాంచకం’ సినిమాను అందరూ చూసి హిట్ చేయండి” అని పిలుపునిచ్చారు.
జీవితమే ఒక రోమాంచకం..
“డబ్బులు లేక ఇబ్బంది పడటం, బరువు తగ్గడం, జిమ్ చేయడం, ఆల్కహాల్ మానేయడం, ప్రేమలో పడటం, బ్రేకప్ అవ్వడం.. ఇలా నా జీవితంలో ప్రతి క్షణం ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. మీరూ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అనుకున్న లక్ష్యం కోసం ప్రతి క్షణం నిరంతరం కష్టపడాలి” అంటూ అభిమానులకు స్ఫూర్తినిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *