Rashmika Mandanna: సోషల్ మీడియాలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ పెళ్లి పైన వస్తున్న ట్రోలింగ్లపై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్న సందర్భంగా తమ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు దారితీయడంతో, రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ఇంటర్నెట్లో విమర్శలు గుప్పించే అపరిచితులకు తమ వ్యక్తిగత జీవితం గురించి పూర్తి వాస్తవాలు తెలియవని, ఎన్ని జన్మలైనా విజయ్‌నే తన భాగస్వామిగా ఎంచుకుంటానని ఆమె తేల్చి చెప్పారు.
వివాదానికి దారితీసిన ‘కాఫీ విత్ కరణ్’ వ్యాఖ్యలు
తమ పెళ్లి ప్రతిపాదన గురించి విజయ్ దేవరకొండ షోలో సరదాగా మాట్లాడుతూ.. రష్మిక మొదటిసారి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు “నన్ను 100 సార్లు అడుగు” అని ఆటపట్టించినట్లు చెప్పారు. అందుకు రష్మిక స్పందిస్తూ.. విజయ్ ఒప్పుకునేవరకు ఏడాది పాటు ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నానని వెల్లడించారు. ఈ సంభాషణను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు నెటిజన్లు, రష్మిక మాత్రమే ఈ బంధంలో ఎక్కువ ఆసక్తి చూపించిందని, విజయ్ ఆమెను తక్కువ చేసి మాట్లాడారని కామెంట్లు చేస్తూ రీల్స్, వీడియోలు చేశారు.
ఆ వంద సార్లు అనేది ఒక లెక్క మాత్రమే కాదు
ఈ ప్రచారానికి రష్మిక తన లేఖ ద్వారా పూర్తి వివరణ ఇచ్చారు. “మా మధ్య జరిగిన సంభాషణ సాధారణమైంది కాదు. మేము మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడిగే గ్రాండ్ ప్రపోజల్స్ కోసం చూడలేదు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, మానసిక ఒత్తిళ్లను తట్టుకుంటూ కలిసి ప్రయాణించగలమా లేదా అన్నది అర్థం చేసుకోవడానికి విజయ్ ఆలోచించి సమయం తీసుకున్నాడు. నేను మనసుతో ఆలోచిస్తే, అతడు వాస్తవాలను ప్రాక్టికల్‌గా చూస్తాడు. మా ఇద్దరి జీవితానికి ఆ సమతుల్యత అవసరం. అతడి కోసం 100 సార్లు కాదు.. వేయి సార్లైనా అడుగుతాను. జీవితాంతం ప్రేమించే భాగస్వామి దొరికినప్పుడు పెళ్లి చేసుకుందాం అని పదే పదే అడగడంలో తప్పు లేదు అని పేర్కొన్నారు.
సలహాలు ఇచ్చేవారికి దిమ్మతిరిగే సమాధానం
ఆడపిల్లకు రక్షణ కల్పించే ముసుగులో ఉచిత సలహాలు ఇచ్చేవారిని ప్రశ్నిస్తూ రష్మిక ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు మీరెవరూ నా పక్కన లేరు. కానీ విజయ్ అప్పుడు నా పక్కనే ఉన్నాడు.. ఇప్పుడూ నాతోనే ఉన్నాడు. నా ఎముక విరిగినప్పుడు, నెలకు వచ్చే నొప్పితో బాధపడినప్పుడు, అర్ధరాత్రి ఆందోళనతో నిద్రలేచినప్పుడు, మానసికంగా కుంగిపోయినప్పుడు నాకు తోడుగా నిలిచింది కేవలం విజయ్ మాత్రమే.
ప్రేమించే కుటుంబ సభ్యులను తెలియకుండా విమర్శించడం స్త్రీవాదం (ఫెమినిజం) అనిపించుకోదు. ఎవరి జీవితాన్ని, భాగస్వామిని వారు ఎంచుకునే స్వేచ్ఛే నిజమైన స్త్రీవాదం” అని రష్మిక స్పష్టం చేశారు.విజయ్ దేవరకొండతో తమ బంధంపై వస్తున్న ట్రోల్స్‌కు చెక్ పెడుతూ రష్మిక మందన్నా భావోద్వేగంగా సమాధానం ఇచ్చారు. తమ ఇష్టపూర్వక నిర్ణయంతో, పరస్పర గౌరవంతో వివాహం చేసుకున్నా మని, కల్పిత ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేస్తూ తమ వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యానాలు ఆపాలని హితవు పలికారు.
🫰🏻🫶🏻♥️ https://t.co/nQ3W0DYf0K
— Rashmika Mandanna (@iamRashmika) October 26, 2026
