Rashmika Mandanna: బాలీవుడ్లో రష్మికా హవా.. మరో మూవీ అనౌన్స్!

టాలీవుడ్ లో రష్మికా మందన్నా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ వేరే లెవల్. గీత గోవిందం మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనా ఈ కన్నడ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. గతేడాది వచ్చిన యానిమల్ మూవీతో మంచి హిట్టు కొట్టిన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. త్వరలోనే అల్లుఅర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతోంది. దీంతో రష్మిక మందన్నా రేంజ్ ఓ లెవల్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం షూటింగ్ లో బిజిబిజీగా గడుపుతోంది. ఈ అమ్మడికి మరో ఆఫర్ వచ్చింది.

‘స్త్రీ’, ‘బేడియా’, ‘ముంజ్య’ సినిమాలను తెరకెక్కించిన మేకర్స్ విభిన్నమైన కాన్సెప్ట్ ‘థమా’అనే మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కోసం రష్మికాను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పేసిందంట. ఆ విషయాన్నే మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “ఈ యూనివర్స్ ఒక ప్రేమ కథ కోరుకుంటుంది. దురదృష్టవశాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్నది” అని టీమ్ పేర్కొంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ముంజ్య’ డైరక్టర్ ఆదిత్య సర్పోత్థార్ థమాను తెరకెక్కించబోతున్నారు. ‘బేడియా’, ‘స్త్రీ’ నిర్మాత దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీని విడుదల చేయనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *