Team India: వాంఖడేలోనైనా విజయం వరించేనా..!

IND vs NZ Test Series: భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో న్యూజిలాండ్ జట్టు అద్భుతం చేసి చూపింది. వరుస సిరీస్ విజయాలతో మంచి ఊపుమీదున్న టీమిండియాను.. కివీస్ మట్టి కరిపించింది. 18 వరుస సిరీస్ ల గెలుపు అనంతరం 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై రోహిత్ సేన టెస్టు సిరీస్ ను కోల్పోయింది. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే.. పర్యాటక జట్టు2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరిగే మూడో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ ను వైట్ వాష్ చేయాలని కివీ టీం ఉవ్విళ్లూరుతోంది. మరోపక్క ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా చమటోడుస్తున్నారు.

హర్షిత్ రాణాకు పిలుపు..
ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. క్లీన్ స్వీప్‌ను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా గెలవడమో లేక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమో జరిగి తీరాలల్సిన పరిస్థితులను ఆతిధ్య జట్టు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు బాగా అచ్చొచ్చిన సొంత మైదానంలో టీమిండియా మూడో టెస్ట్‌ను ఆడనుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ.. తుది జట్టు కోసం కీలక మార్పులు చేర్పులు చేసింది. ఇటీవల రంజీల్లో అదరగొట్టిన ఢిల్లీ స్టార్ పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకొచ్చింది. ఉన్నపళంగా టీంతో చేరాలని అతన్ని ముంబైకి పిలిపించుకుంది. దాంతో అతను బుధవారం జట్టుతో చేరాడు. అయితే తుదిజట్టులోకి హర్షిత్ రాణాను తీసుకుంటే.. జస్‌ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్‌లల్లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.

వాంఖడేలో టీమిండియా రికార్డు
న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే 50 ఏళ్లలో వాంఖడే స్టేడియంలో టీమిండియా మొత్తం 26 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 12 మాత్రమే గెలిచింది. అంటే సగం కంటే తక్కువ మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 7 సార్లు ఓడిపోయింది. మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. వాంఖడేలో భారత రికార్డు ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి.. మూడో టెస్టులో రోహిత్ సేనకు విజయం అంత తేలిక అయితే కాదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: రెచ్చిపోతున్న మాఫియా..వణుకు పుట్టిస్తున్న పవన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *