Rashmika Mandanna

Rashmika Mandanna: మోస్ట్ అవైటెడ్ 20లో రశ్మిక 3 చిత్రాలు!

Rashmika Mandanna: 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ను ఐఎండిబి రూపొందించింది. అందులో రశ్మిక నటించిన మూడు చిత్రాలకు చోటు దక్కటం గమనార్హం. ఇక ఈ లిస్ట్ ను పరిశీలిస్తే నెంబర్ వన్ ప్లేస్ లో సికిందర్, ఆ తర్వాత యశ్ టాక్సిస్ ఆపై కూలీ, హౌస్ ఫుల్ 5, బాఘీ, రాజా సాబ్, వార్ 2, ఎల్2: ఎంపురాన్, దేవా, చావా, కన్నప్ప, రెట్రో, థగ్ లైఫ్‌, జాట్, స్కై ఫోర్స్, సితారే జమీన్ పర్, థామా, కాంతారా చాప్టర్1, ఆల్ఫా, తండేల్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇందులో మొత్తం 11 హిందీ సినిమాలు, మూడు తెలుగు, మూడు తమిళ, రెండు కన్నడ, ఓ మలయాళ చిత్రం ఉన్నాయి. ఇక రశ్మిక నటించిన ‘సికిందర్, చావా, థామా మూడు చిత్రాలకు చోటు దొరకటం విశేషం. అయితే ఈ లిస్ట్ పై కొందరు పెదవి విరుస్తుండటం గమనార్హం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lucknow: పెళ్లిలో అనుకోని అతిథి.. దెబ్బకు అక్కడంతా పరుగో పరుగు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *