Love & War: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పీరియడ్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ & వార్’ (Love & War) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రక్తమోడుతున్న చేత్తో రణ్‌బీర్ మాస్ లుక్..
విడుదలైన పోస్టర్లో రణ్‌బీర్ కపూర్ చాలా స్టైలిష్‌గా, అలాగే ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు..బజ్ కట్ హెయిర్‌స్టైల్, కళ్లజోడు, వైట్ టీ-షర్ట్ ధరించి వింటేజ్ కారు డ్రైవ్ చేస్తున్నట్లుగా ఈ లుక్ డిజైన్ చేశారు ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకోగా.. మరో చేతికి తీవ్ర గాయమై రక్తం కారుతున్నట్లు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “వో రుత్బా.. వో రౌబ్.. వో జునూన్!” అనే క్యాప్షన్‌తో భన్సాలీ ప్రొడక్షన్స్ ఈ పోస్టర్‌ను షేర్ చేసింది. సినిమాలో నటిస్తున్న విక్కీ కౌశల్, ఆలియా భట్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ లుక్‌ను పోస్ట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను పంచుకున్నారు.
అసలు ‘లవ్ & వార్’ కథేంటి?
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ముగ్గురూ కలిసి మొదటిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటిస్తున్నారు. సుప్రియా పాఠక్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
20 ఏళ్ల తర్వాత భన్సాలీతో రణ్‌బీర్..
రణ్‌బీర్ కపూర్ తొలి సినిమా ‘సావరియా’ (2007) తర్వాత దాదాపు 20 సంవత్సరాలకు మళ్లీ భన్సాలీ దర్శకత్వంలో నటిస్తున్నారు. అలాగే ‘గంగూబాయి కతియావాడి’ హిట్ తర్వాత ఆలియా మళ్లీ భన్సాలీతో కలిసి పనిచేస్తున్నారు.
ఇది సాధారణ కాస్ట్యూమ్ డ్రామా కాకుండా యుద్ధం నేపథ్యంతో సాగే పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ కథ. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇద్దరూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లుగా కనిపించనున్నారు. వారిద్దరి జీవితాలు ఆలియా పాత్రతో ఎలా ముడిపడ్డాయి, యుద్ధ వాతావరణంలో ఈ ముగ్గురి మధ్య ఎలాంటి భావోద్వేగాలు నడిచాయన్నదే ప్రధాన కథాంశం.
షూటింగ్ పూర్తి – 500 మందితో ఎన్డీఏ (NDA) ఒప్పందాలు..
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2024 నవంబర్‌లో మొదలై, 2026 సెప్టెంబర్ నాటికి దాదాపుగా పూర్తయింది.
యుద్ధ సన్నివేశాలు భారీగా ఉండటంతో కొన్ని కీలక యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా రీ-షూట్ కూడా చేశారు. సినిమాకు సంబంధించిన కథ, లుక్స్ ఏవీ బయటకు లీక్ కాకుండా ఉండేందుకు భన్సాలీ టీమ్ కఠిన జాగ్రత్తలు తీసుకుంది. నటీనటులతో పాటు సెట్స్‌లో పనిచేసిన దాదాపు 500 మంది క్రూ మెంబర్లతో లీగల్ నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లు (NDAs) చేయించడం విశేషం.
రెండు నెలల తేడాతో రెండు భారీ సినిమాలు..
రణ్‌బీర్ కపూర్ నుంచి రెండు భారీ భిన్నమైన ప్రపంచాలు అతి తక్కువ వ్యవధిలోనే బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి:
-
రామాయణ (పార్ట్ 1): రణ్‌బీర్ రాముడిగా నటించిన మైథలాజికల్ చిత్రం 2026 నవంబర్‌లో రిలీజ్ కానుంది.
-
లవ్ & వార్: ఆ తర్వాత సరిగ్గా రెండు నెలల వ్యవధిలోనే.. 2027 జనవరి 21న ఈ పీరియడ్ వార్ డ్రామా థియేటర్లలోకి రానుంది.
ఒకవైపు రాముడి పాత్ర, మరోవైపు యాక్షన్-రొమాన్స్‌తో కూడిన పైలట్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

