Ramgopal Varma:

Ramgopal Varma: డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్..  మూడు నెలల జైలు శిక్ష

Ramgopal Varma: ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు కోర్టు భారీ షాకిచ్చింది. ప‌లు వివాదాల్లో ఇరుక్కున్న ఆయ‌న‌కు ఇది భారీ షాక్‌గానే చెప్పుకోవ‌చ్చు. ఓ చెక్కు బౌన్స్ కేసులో వ‌ర్మ‌ను ముంబైలోని అంధేరీ కోర్టు దోషిగా తేల్చింది. ఏకంగా ఆయ‌న‌కు మూడు నెల‌లు జైలు శిక్ష‌ను విధిస్తూ తీర్పునిచ్చింది. త‌న జీవితంలో కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో తాను చాలా కోల్పోయానంటూ ప‌శ్చాత్తాప ప‌డుతున్న త‌రుణంలో ఈ తీర్పు వెలువ‌డ‌టం ఆయ‌న‌కు శ‌రాఘాతమే.

Ramgopal Varma: ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై 2018లో మ‌హేశ్ చంద్ర మిశ్రా అనే వ్య‌క్తి శ్రీ అనే కంపెనీ పేరుతో చెక్కు బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు ఈ కేసు ఏడేళ్లుగా విచార‌ణ కొన‌సాగుతున్న‌ది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా వ‌ర్మ కోర్టుకు గైర్హాజ‌ర‌య్యాడు. దీంతో అత‌నిపై కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. భార‌త శిక్షాస్మృతిలోని సెక్ష‌న్ 138 ప్ర‌కారం వ‌ర్మ‌ను కోర్టు దోషిగా నిర్ధారించారు.

Ramgopal Varma: వ‌చ్చే మూడు నెల‌ల్గోగా ఫిర్యాదుదారుడికి రామ్‌గోపాల్ వ‌ర్మ రూ.3.72 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని, లేదంటే మ‌రో మూడు నెల‌లు సాధార‌ణ జైలు శిక్ష‌ను అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని కోర్టు వెల్ల‌డించింది. ఈ నేరం నెగోషియ‌బుల్ ఇన్స్ట్రుమెంట్స్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 131 కిందికి వ‌స్తుంద‌ని, దీనికింద చిత్ర నిర్మాత‌పై చ‌ట్ట‌పర‌మైన చ‌ర్య తీసుకున్న‌ట్టు కోర్టు అభిప్రాయం వ్య‌క్తంచేసింది. ఇదిలా ఉండ‌గా ఇదే కేసులో వ‌ర్మ‌కు ఒక‌సారిగా బెయిల్ కూడా ల‌భించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shilpa Shetty: గుడిలో ఉన్న శిల్పాశెట్టి ఫోటోలు వైరల్.. అధికారులకు షోకాజ్ నోటీసులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *