rgv

RGV: మహాన్యూస్ క్వశ్చన్.. ఆర్జీవీ ఇరిటేషన్.. నేను చెప్పను.. ఫో..!

RGV: ఒక సామెత ఉంది తాను చేస్తే..** ఇతరులు చేస్తే..**. ఇది కరెక్ట్ గా ఆర్జీవీ వాదనకు సరిపోతుంది. ఆయన ఎవరినైనా ఏదైనా అడగవచ్చు.. అవతలి వారిని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు.. రుజువులు లేకుండా.. అడ్డగోలుగా కథలు అల్లి సినిమాలు తీయవచ్చు.. కానీ, ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదు. 

నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను.. నా పాథమిక హక్కు ఎవరనా తిట్టడం అని ఆయన మాట్లాడవచ్చు. ప్రెస్మీట్ పెట్టిమరీ నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. కానీ, ఎవరూ ఆయనను ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వెంటనే ఇరిటేషన్.. ఫస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తాయి. 

ఇదిగో ఆయనగారి ఇరిటేషన్ కి సాక్ష్యం. తనపై కేసులు నమోదు అయితే, కోర్టుకు వెళ్లి అరెస్ట్ కాకుండా విజయవంతంగా స్టే తెచ్చుకున్నాను అంటూ ఓ ప్రెస్మీట్ పెట్టారు. సదరు ప్రెస్మీట్ లో ఆయనను మహా న్యూస్ మధు అడిగిన ప్రశ్న చాలా చికాకు పెట్టింది. 

ఇది కూడా చదవండి:Cyclone Fengal: తీరం దాటిన ఫెంగల్.. తమిళనాడులో భారీ వర్షాలు..

RGV: హైదరాబాద్ లో పోలీసులు రెండు రోజులు మీకోసం వెతుకుతుంటే.. మీరు దొరకలేదు కదా అని అడిగితే.. పోలీసులు రెండు రోజులు వెతికారనే సాక్ష్యం నీదగ్గర ఉందా అంటూ ఎదురు దాడికి దిగారు. సాక్ష్యం చూపించు లక్ష రూపాయాలిస్తాను అంటూ విరుచుకు పడ్డారు. రెండు గంటలే నాకోసం వెతికారు అంటూ చెప్పుకొచ్చారు. సరే.. రెండు రోజులు కాదు.. రెండుగంటలు ఏదైతేనేం.. పోలీసులు మీకోసం వచ్చినపుడు మీరు ఎదో షూటింగ్ లో ఉన్నానని చేప్పారు కదా.. ఈ సినిమా షూటింగ్ సార్ అది అని మహా న్యూస్ మధు ప్రశ్నిస్తే.. ఆర్జీవీ ఇరిటేషన్ పీక్స్ కి వెళ్ళిపోయింది. నేను చెప్పను ఫో.. అంటూ చిత్ర విచిత్రంగా చేతులు ఊపుతూ ప్రెస్మీట్ నుంచి లేచి చక్కా వెళ్లిపోయారు. 

అదండీ విషయం.. కోర్టులో వారం రోజులు ఆయనను అరెస్ట్ చేయవద్దు అనే చిన్న రిలాక్స్ దొరికింది. దానికి పెద్ద ప్రజలకు ఎదో ఉపకారం చేసినట్టు ప్రెస్మీట్ పెట్టడం ఎందుకు? సినిమాల్లో స్మగ్లర్లను హీరోల్లా చూపించడం అలవాటు అయిపోయి.. తప్పు చేసి తప్పించుకోవడానికి కోర్టులను అడ్డం పెట్టుకున్న ఆర్జీవీ.. గౌరవ కోర్టు ఇచ్చిన రిలాక్సేషన్ ఎదో గొప్ప విజయంలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. అంటూ ఆయనను అభిమానించే వారు కూడా అనుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఆర్జీవీ దొంగా పోలీసు ఆట చూస్తున్న ఆయన అభిమానులతో పాటు ప్రజలంతా కిసుక్కున నవ్వుకుంటున్నారు. పాపం ఆయనకు ఇంకా ఆ విషయం తెలిసినట్టు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *