Peddi Trailer

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎప్పుడంటే?

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్డేట్ రానే వచ్చింది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. మే 18న ఈ భారీ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమాను జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం సినిమా కథకు తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన విలేజ్ సెట్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రత్యంగిర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని విదేశాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. జూన్ 3వ తేదీనే ఉత్తర అమెరికా వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

1970-80 కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కుస్తీ, క్రికెట్ ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. చరణ్ మాస్ యాక్షన్, బుచ్చిబాబు మేకింగ్ కలసి ఈ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *