Jailer 2

Jailer 2: నన్ను కొట్టొద్దు.. కాల్చొద్దు.. రజనీకాంత్‌కె కండిషన్స్ పెట్టిన విలన్..!

Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ‘జైలర్ 2 సూపర్ షో’లో రజనీకాంత్ సినిమాకి సంబందించిన కొన్ని విషయాలు పంచుకుంటూ.. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారో చెబుతూ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ బయటపెట్టారు. సినిమాలో నటించేందుకు మిథున్ చక్రవర్తి ఓ ఆసక్తికరమైన సరదా షరతు పెట్టారని తలైవా చెప్పుకొచ్చారు.

రజనీతో దెబ్బలు తినాలా? గెట్ లాస్ట్..  మిథున్ చక్రవర్తి రియాక్షన్

మిథున్ నాకు చాలా మంచి మిత్రుడు. మొదట మా ప్రొడక్షన్ టీమ్ ఆయన్ను సంప్రదించినప్పుడు.. ‘సినిమాలో నా రోల్ ఏంటి? ఒకవేళ విలన్ అయితే రజనీకాంత్ చేతిలో దెబ్బలు తినాలా? అలాగైతే నేను చేయను.. గెట్ లాస్ట్’ అని సరదాగా అన్నారట.  

ఆ తర్వాత ‘వేవ్స్ సమ్మిట్’ (WAVES Summit) కార్యక్రమంలో మేమిద్దరం కలిసినప్పుడు ఈ సినిమా టాపిక్ వచ్చింది. ‘నువ్వు అడిగావు కాబట్టి నేను కచ్చితంగా చేస్తాను రజనీ.. కాకపోతే నాదొకటే కండిషన్. సినిమాలో నువ్వు నన్ను కొట్టకూడదు, కాల్చడం లాంటివి చేయకూడదు’ అని మిథున్ నాతో సరదాగా అన్నారు. దానికి నేను నవ్వుతూ.. డైరెక్టర్ నెల్సన్‌తో మాట్లాడి చెబుతానని అన్నాను అంటూ రజనీకాంత్ ఆనాటి ముచ్చట్లను గుర్తుచేసుకున్నారు.

దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసిన రజనీ – మిథున్..

1989లో రమేశ్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన ‘భ్రష్టాచార్’ (Bhrashtachar) హిందీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మిథున్ నటించిన బెంగాలీ సినిమా ‘భాగ్య దేవత’ (1995)లో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. 2015లో వచ్చిన ‘యాగవరాయినుమ్ నా కాక్క’ సినిమా తర్వాత మిథున్ చక్రవర్తి దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ తమిళ్‌లో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
భారీ తారాగణం – అడ్వాన్స్ బుకింగ్స్‌లో సునామీ..
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సీక్వెల్‌లో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలంతా నటిస్తున్నారు:
నటీనటులు..
మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ మరోసారి తమ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండగా.. రమ్యకృష్ణ, ఎస్‌.జె. సూర్య, విద్యాబాలన్, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.
హిందీ రిలీజ్‌పై స్పష్టత..
హిందీలో రిలీజ్ ఆలస్యం అవుతుందంటూ వచ్చిన వదంతులను చిత్ర యూనిట్ ఖండించింది. అన్ని భాషలతో పాటే హిందీలోనూ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15నే సినిమా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *