Coolie

Coolie: రజినీకాంత్ ‘కూలీ’ ఫీవర్.. ఓవర్సీస్‌లో భారీ డిమాండ్!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ పట్ల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని అంచనా. ఈ సినిమా కోసం భారత్‌లోనే కాక, విదేశాల్లోనూ అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కోసం పంపిణీదారుల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ చిత్రం అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుందని డిస్ట్రిబ్యూటర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Puri-Nagarjuna: నాగార్జునతో పూరి జగన్నాథ్ షాకింగ్ సర్‌ప్రైజ్?

Coolie: ‘కూలీ’ రిలీజ్ హక్కుల కోసం ఓవర్సీస్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకి మరో హైలైట్. ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ, రజినీ మ్యాజిక్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *