R Narayana Murthy

R Narayana Murthy: సినిమా బాగుంటే జనం చూస్తారు.. ఆర్. నారాయణమూర్తి కీలక వాక్యాలు..

R Narayana Murthy: టాలీవుడ్‌ లో తాజాగా నెలకొన్న థియేటర్ల బంద్ వివాదం చుట్టూ రాజకీయ ఆరోపణలు, సినీ పరిశ్రమ ఆవేదనలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్పందించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్, టికెట్ ధరల పెంపు, సామాన్య ప్రేక్షకులపై దాని ప్రభావం లాంటి కీలక అంశాలపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా వినోదం కాదు.. ఖరీదు అయింది!

వినోదం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో చూడగలిగే సినిమా ఖరీదైన మాజిక్‌గా మారిపోయింది, అని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణమూర్తి. టికెట్ ధరలు పెంచి, పాప్‌కార్న్ రేట్లు మించి పెట్టడం వల్ల ప్రజలు థియేటర్లకు దూరమవుతున్నారని అన్నారు.

పెద్ద బడ్జెట్ సినిమాల కోసం ప్రజలపై భారం ఎందుకు?

హాలీవుడ్‌ లో వేల కోట్లతో సినిమాలు తీసిన వారు టికెట్ ధరలు పెంచమని అడగరని గుర్తు చేశారు. “మన దేశంలో ముగల్-ఎ-ఆజాం, షోలే, తీసిన వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమని అడగలేదు అన్నారు. లవకుశ వంటి సినిమాలు ఐదేళ్లూ తీశారు,  అప్పుల పాలయ్యారు కానీ టికెట్ ధరలు పెంచమని అడగలేదు. ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమా కోట్లు ఖర్చు పెడుతాం కాబట్టి ధరలు పెంచాలి అంటున్నారు. పెట్టిన డబ్బులు ప్రజల నుంచి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఇది ప్రజలపై భారం  కాదా?”వలని మోసం చేస్తునట్టు కదా అని ప్రశ్నించారు.

పర్సంటేజ్ విధానమే మార్గం

సింగిల్ స్క్రీన్ థియేటర్లు తిరిగి అభివృద్ధి చెందాలంటే అద్దె విధానాన్ని తొలగించి పర్సంటేజ్ విధానం అమలు చేయాలన్నారు. ఇది చిన్న నిర్మాతలకు ఊపిరి పోసే మార్గం. దీనివల్ల చిన్న సినిమాలకూ అవకాశాలు వస్తాయి. దీనిపై దిల్ రాజు కూడా అంగీకరించారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Kamal Haasan: సారీ చెప్పానన్న కమల్ హాసన్.. కర్ణాటక సినిమాలు బ్యాన్ చేస్తాం అన్న మంత్రి

పవన్ వ్యాఖ్యలపై వ్యతిరేక స్పందన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవికావని స్పష్టం చేశారు. బంధ్ అనేది హరి హర వీరమల్లుని అడ్డుకునేందుకు కాదని, ఇది ఎంతో కాలంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమని చెప్పలేకపోతున్నారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ప్రముఖులకు బాధ్యత ఎక్కువ

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అని గర్వంగా ఉంది. కానీ, ఆ స్థాయిలో ఉండి, పరిశ్రమ సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు సమయం కేటాయించి ఉండాలి. సినిమాకు కష్టపడే చిన్న నిర్మాతలు, థియేటర్ యజమానులకు మద్దతుగా ఉండాలి,” అన్నారు నారాయణమూర్తి.

ALSO READ  Spirit Movie: ప్రభాస్ సినిమా నుండి దీపిక ఔట్.. రూ. 16 కోట్ల లాభం

ముగింపు:

సినీ పరిశ్రమలో థియేటర్ల సమస్య, టికెట్ ధరలు, ప్రభుత్వ స్పందన, రాజకీయ వ్యాఖ్యల చుట్టూ ఈ వివాదం ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో చూస్తే… భవిష్యత్తులో ప్రజల వినోదాన్ని కాపాడటానికి, చిన్న సినిమాలకు మద్దతివ్వడానికి అన్నివర్గాలు ఒకే పేజీలోకి రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *