Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. గత యేడాది జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 1800 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. మూడేళ్ళ పాటు ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అమెరికాలో సేద తీరుతున్నారు. అక్కడ నుండి రాగానే ఆయన రామ్ చరణ్ తో తెరకెక్కించే సినిమా మీద దృష్టి పెడతారు. అలానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. అయినా కూడా ‘పుష్ప -3’ మూవీ ఇప్పట్లో ఉండని వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా జరిగిన దుర్ఘటన ప్రజల మనో ఫలకం మీదనుండి చెరిగిపోయిన తర్వాతే దీని సీక్వెల్ గురించి ఆలోచించాలని మేకర్స్ భావితున్నారట. అందువల్ల ‘పుష్ప-2’ 2027లో కానీ మొదలు కాదని తెలుస్తోంది.