Pushpa 2: ఒకవైపు పుష్ప 2 సినిమా రికార్డుల పరంపర కొనసాగుతుండగా, మరోవైపు పుష్పరాజ్ మేనరిజాలను పండిస్తున్న ప్రబుద్ధులు పెరిగిపోతున్నారు. మహారాష్ట్రలో 10 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ పుష్ప 2 సినిమా చూసేందుకు వస్తాడని వలపన్ని పోలీసులు పట్టుకున్న ఘటన ఇటీవలే చేసుకున్నది. ఇది మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన జరిగింది.
Pushpa 2: తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాదిక్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా నర్సీపట్నం వచ్చాడు. అక్కడే పుష్ప 2 సినిమా చూశాడు. అక్కడి బస్టాండులో ఉన్న ఓ బస్సులో పడుకున్నాడు. అదే బస్సుకు తాళం ఉండటాన్ని గమనించాడు. అతని మనసులో ఏమనిపించిందో.. సినిమా మత్తులోనే ఉన్నాడో ఏమో కానీ, ఆ బస్సును స్టార్ట్ చేసి నడుపుకుంటూ వెళ్లాడు.
Pushpa 2: సరాసరా అదే రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలూరు దాకా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడే రోడ్డు పక్కన బస్సును నిలిపి ఉంచి దానిలోనే పడుకున్నాడు. ఈ లోగా పోలీసులకు బస్సు అపహరణ సమాచారం అందడంతో వెతకడం ప్రారంభించారు. చింతలూరు వద్ద బస్సు ఆగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. బస్సులోనే పడుకున్న దొంగను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇదన్న మాట మ్యాటర్.. సినిమా చూసి రావడం, బస్సును అపహరించడం.. ప్చ్.. ఇదంతా పుష్పరాజ్ మహిమ అంటూ స్థానికులు సరదాగా మాట్లాడుకోవడం గమనార్హం.