Idupu Kayitham Teaser: అచ్చమైన తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో.. మన ఇంటి పక్కనే జరిగే కథలా ఉండే సినిమాలు వస్తే ఆ మజానే వేరు! ‘మల్లేశం’, ‘బలగం’ లాంటి సినిమాలతో తెలంగాణ నేటివిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన టాలెంటెడ్ హీరో ప్రియదర్శి.. ఇప్పుడు మరో రూటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమా పేరే ‘ఇడుపు కాయితం’ (తెలంగాణ యాసలో విడాకుల కాగితం అని అర్థం). గురువారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ, ఒకవైపు నవ్విస్తూనే చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
పెళ్లి చూపులతో మొదలై.. విడాకుల ట్విస్ట్ దాకా!
కొత్త దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నాగదుర్గ హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతున్నారు.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పెళ్లి చూపులు, ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లి వేడుకలు, కొత్త జంట మధ్య ఉండే చిలిపి సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలను టీజర్లో చాలా సహజంగా చూపించారు.అంతా హ్యాపీగా సాగిపోతోంది అనుకునే టైమ్‌లో.. భార్యాభర్తలిద్దరూ విడాకులు (ఇడుపు కాయితం) తీసుకుంటున్నట్లు ప్రకటించి టీజర్ చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అన్యోన్యంగా కనిపించిన ఈ జంట మధ్య అసలేం జరిగింది? విడాకుల దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే క్యూరియాసిటీని టీజర్ బాగా క్రియేట్ చేసింది.
సుకుమార్, బన్నీ వాస్ కాంబో – క్రేజీ క్యాస్టింగ్..
ఈ సినిమా వెనుక టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు ఉండటంతో ప్రాజెక్ట్‌కు మొదటి నుంచే మంచి క్రేజ్ ఏర్పడింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), తబితా సుకుమార్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, నాగదుర్గలతో పాటు అభినవ్ గోమటం, అభయ్ నవీన్, యాంకర్ శివజ్యోతి, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ పక్కా లోకల్ ఫ్లేవర్‌ను తీసుకొచ్చారు.
చార్ట్‌బస్టర్ సాంగ్స్ – డిసెంబర్ 11న థియేటర్లలోకి..
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన బాణీలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలు సోషల్ మీడియాలో రీల్స్‌తో హోరెత్తిస్తూ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పబ్లిసిటీతో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
