the Raja Saab

The Raja Saab: వార్నీ.. ప్రభాస్ రాజాసాబ్ మూవీ హాలీవుడ్ డిజాస్టర్ రీమేకా? మారుతి పెద్ద ట్విస్ట్ ఇస్తాడా?

The Raja Saab: ప్రభాస్ మూవీ అంటేనే ఒక రేంజ్. టాలీవుడ్.. సౌత్ ఇండియా.. పాన్ ఇండియాలను దాటి పాన్ వరల్డ్ స్థాయి ప్రభాస్ ది. ప్రభాస్ సినిమా అంటే ఆ రేంజ్ లోనే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇక డైరైక్టర్ మారుతి అంటే కామెడీ టచ్ తో అద్భుతాలను సృష్టించే డైరెక్టర్ గా సౌత్ ఇండియాలో ఒక ఇమేజ్ ఉంది. మామూలుగా చూస్తే ప్రభాస్ తో సినిమా చేయాలంటే డైరెక్టర్ గా మన ఊహలకు కూడా మారుతి అందడు. కానీ, ప్రభాస్ తాజాగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి చాలా అప్ డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ రేంజ్ కి తగ్గ టైటిల్ తో ఆ సినిమా రెడీ అవుతొంది. అదే రాజా సాబ్!

ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ పబ్లిసిటీకి దూరంగా రాజాసాబ్ షూటింగ్ సైలెంట్ గా అయిపోతోంది. ఆమధ్య ప్రభాస్ కాలికి గాయం తగలడంతో సినిమా షూటింగ్ సరిగా జరగలేదు. జనవరిలో విడుదల కావలసిన సినిమా మార్చికి వాయిదా పడింది. మర్చి కూడా కాదు ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 28 అని లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మల్టీ ప్లెక్స్ లో అదే డేట్ తో రాజాసాబ్ సినిమా పోస్టర్ సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే , మారుతి కామెడీ హారర్ సినిమాలు స్పెషలిస్ట్ అనేది తెలిసిందే. రాజా సాబ్ కూడా అదే జానర్ లో తెరకెక్కుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి షాకింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అది రాజాసాబ్ మూవీ అప్పుడెప్పుడో హాలీవుడ్ లో వచ్చిన ఒక డిజాస్టర్ మూవీకి మక్కీకి మక్కీ కాపీ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇదే విషయం ఇప్పుడు పెద్దగా సౌండ్ చేస్తోంది. హాలీవుడ్ లో 1998లో వచ్చిన విలియం రాబిన్ హీరోగా తెరకెక్కిన ‘వాట్ డ్రీమ్స్ మే కమ్’(What Dreams May Come)మూవీని తెలుగులో ప్రభాస్ తో తీస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ సినిమా రిచర్డ్ మాథేసన్ రాసిన ‘వాట్ డ్రీమ్స్ మే కమ్’ అనే నవల ఆధారంగా హాలీవుడ్ లో తెరకెక్కింది.

అప్పట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ అదే స్థాయిలో భారీ డిజాస్టర్ గా హాలీవుడ్ రికార్డులకెక్కింది. ఈ సినిమా ఒక ఆత్మ కథ. తాను చచ్చిపోయాను అని తెలియక ఒక ఆత్మ ఇక్కడే తిరుగుతూ.. అందరితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ, ఎవరికీ అది కనబడదు కదా.. దాంతో ఇలా లాభం లేదని తన ఒంటరి తనం పోగొట్టుకోవడానికి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. అక్కడ ఆ ఆత్మ ఏమి చేసింది అనేదే సినిమా.

మరి ఇలాంటి కథను మారుతి.. ప్రభాస్ తో చేయడానికి ఎంచుకున్నారన్న వార్త కాస్త షాకింగ్ గానే ఉంది. అయితే ఈ స్టోరీ లైన్ తీసుకుని ఉండవచ్చని.. దానిని తెలుగీకరించి మారుతి తన స్టైల్ లో తీస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు రాజాసాబ్ ఏమిటో తేలాలంటే అక్టోబర్ వరకూ ఆగాలి. ఏది ఏమైనా మారుతి-ప్రభాస్ కాంబినేషన్ పై ఇప్పటివరకూ అయితే సూపర్ అంచనాలే ఉన్నాయి.

ముగ్గురు హీరోయిన్లతో ఓ మాస్ పాట ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే చెప్పారు. ఇక ఈ ఐటెం సాంగ్‌లో నయనతార నటించబోతుందని టాక్ వినబడుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా, సంజయ్ దత్ విలన్‌గా రాజా సాబ్ లో కనిపించనున్నారు. అలాగే, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి బాబు, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.

Raja Saab

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *