Dhoom Dhaam Teaser: పలు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గత యేడాది ‘ఆర్టికల్ 370’ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తాను చాటుకుంది. 2021లో దర్శకుడు ఆదిత్య ధర్ ను వివాహం చేసుకున్న ఆమె ఓ బిడ్డకు తల్లి కూడా. అయినా నటిగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. తాజాగా ఆమె ‘ధూమ్ ధామ్’ అనే హిందీ చిత్రంలో నటించబోతోంది. త్వరలో విడుదల కానున్న ‘పులే’ చిత్రంలో మహాత్మా జ్యోతిబా పులే’గా నటించిన ప్రతీక్ గాంధీ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. యామి గౌతమి భర్త ఆదిత్య ధర్ నిర్మిస్తున్న ఈ మూవీని రిషబ్ సేథ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ముంబైకి చెందిన అమ్మాయిగా యామి, వెటర్నరీ డాక్టర్ గా ప్రతీక్ నటిస్తున్నారు. వీరిద్దరికీ సంబంధించిన వివాహ ప్రకటనను తెలియచేసే ప్రకటనకు సంబంధించిన పోస్టర్ మూవీపై ఆసక్తిని పెంచుతోంది.
