Prabhas: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ రూపొందించిన ఈ చిత్రం జూన్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఫ్యాన్స్‌కు మరో భారీ సర్‌ప్రైజ్ వేచి ఉంది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ టీజర్‌ను ‘హరిహర వీరమల్లు’ ప్రింట్స్‌తో జతచేసి విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: Akhil Akkineni : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్?
Prabhas: దర్శకుడు మారుతీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ వార్తపై నిధి సానుకూలంగా స్పందించడంతో ఈ అప్‌డేట్ ఖరారైనట్లే కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ‘హరిహర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ దమ్మున్న లుక్, భారీ నిర్మాణ విలువలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ టీజర్ జోడింపుతో ఈ వేడుక మరింత రెట్టింపవనుంది.