The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ 2026 జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100K డాలర్లు దాటడం గమనార్హం.
Also Read: Boyapati Srinu: బోయపాటి శ్రీనుకు ప్రొడ్యూసర్ సాయి సుధాకర్ కొమ్మాలపాటి ప్రత్యేక అభినందనలు!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన తొలి సింగిల్ ‘రెబల్ సాబ్’ మంచి స్పందన లభించింది. రెండో పాట త్వరలో రిలీజ్ కానుంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే భారీ ఆదరణ లభిస్తోంది. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే 100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ప్రమోషన్లు మరింత బలంగా సాగితే ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇంకా ఊపు తెచ్చుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
