Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, క్రిష్ జాగర్లమూడి కొన్ని సన్నివేశాలకు రూపకల్పన చేసిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ వారం నుంచి ప్రమోషన్స్ జోరందుకోనున్నాయి.
Also Read: Housefull 5: హౌస్‌ఫుల్ 5 కి సెన్సార్ దెబ్బ?
Hari Hara Veeramallu: రెగ్యులర్ ప్రచారం కాకుండా, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంటర్వ్యూలతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. సినిమా కథ, పాత్రలు, నిర్మాణ విశేషాలపై ఆసక్తికర విషయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.

