Crime News: పుష్ప సినిమాలో.. పాల ట్యాంకర్లో ఎర్రచందనం తరలిస్తున్న సీన్ గుర్తుందా? అదే ప్లాన్ను గంజాయి స్మగ్లర్లు అమలు చేశారు. కాకపోతే.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్ ను గుర్తు చేసింది.
కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఏపీలో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్కు వెళ్తున్న ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించండంతో చెకోపోస్టు వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తాయారు చేసిన అరల్లో 290 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72.50లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ బల్వీర్ సింగ్ను అరెస్టు చేశామని, ప్రధాని నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.