Karthik Masam: హిందువులకు పరమ పవిత్రమైన కార్తీకమాసం నవంబర్ 2 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ నెల 2వ తేదీ పోలి స్వర్గంతో కార్తీక మాస దీక్ష ముగుస్తుంది. ఈ నెలలో వివిధ వారాలను హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో పూజలతోపాటు ఇండ్లలో కూడా ఉపవాస దీక్షలు పాటిస్తారు. వేకువజామునే స్నానాలు ఆచరించి, ఆలయాల్లో, ఇండ్లలో పూజలు చేసుకుంటారు. ఈ మాసంలో వచ్చే సోమ, శుక్ర, మంగళవారాల్లో పవిత్ర పూజలు చేస్తారు. ఇలా ఈ నెలలో వచ్చే పవిత్ర వారాల గురించి తెలుసుకుందాం.
నవంబర్ నెలలో వచ్చే పవిత్ర వారాలు
2వ తేదీ – స్థిరవారం కార్తీకమాసం ప్రారంభరోజు
3వ తేదీ – ఆదివారం యమ విదియ భగినీహస్త భోజనం
4వ తేదీ – మొదటి కార్తీక సోమవారం
5వ తేదీ – మంగళవారం నాగుల చవితి
11వ తేదీ – రెండో కార్తీక సోమవారం
12వ తేదీ – మంగళవారం ఏకాదశి
13వ తేదీ – బుధవారం క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
15వ తేదీ – శుక్రవారం కార్తీక పౌర్ణమి
18వ తేదీ – కార్తీకమాసం మూడో సోమవారం
25వ తేదీ – కార్తీకమాసం నాలుగో సోమవారం
26వ తేదీ – కార్తీక బహుళ ఏకాదశి
29వ తేదీ – కార్తీకమాసం మాస శివరాత్రి
డిసెంబర్ నెలలో..
1వ తేదీ – ఆదివారం కార్తీక అమావాస్య
2వ తేదీ – సోమవారం మార్గశిర శుద్ధపౌడ్యమి పోలి స్వర్గం