Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రెండో రోజు పర్యటన అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. “పిఠాపురం నిండుగా.. అభివృద్ధి పండుగ” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా అదనంగా రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం ఆర్ఆర్‌బీహెచ్‌ఆర్ (RRBHR) మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పిఠాపురాన్ని కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
పిఠాపురంలో భారీ ప్రాజెక్టులు – అభివృద్ధి పనుల వివరాలు..
ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఆలయం సమీపంలోనే సభ నిర్వహించిన పవన్.. ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్వామివారి సన్నిధిని అభివృద్ధి చేసేందుకు రెండు విడతలుగా సుమారు రూ. 90 లక్షల నిధులు కేటాయించారు. ఆ నిధులతో కాలక్షేప మండపం, రథశాల, నిత్యాన్నదాన హాలు, యాగశాల వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా పిఠాపురం ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో నూతన శకానికి నాంది పలికారు.
