Virgin Boys

Virgin Boys: వర్జిన్ బాయ్స్ యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్!

Virgin Boys: త్వరలో విడుదల కానున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఆసక్తి రేపుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని ‘పెదవుల తడి’ పాట విడుదల అయ్యింది. ఇది యువత హృదయాలను కట్టిపడేసేలా ఉంది. పూర్ణ చారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్ కె గొంతులోని మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. అతని గాత్రంలోని భావోద్వేగం, యువతీయువకుల ప్రేమ ఊహలను పట్టిస్తూ, పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. స్మరణ్ సాయి సంగీతం ఈ పాటకు యవ్వన శక్తిని, శృంగార హాంగ్‌ను జోడించింది.

వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచింది. నటీనటుల కెమిస్ట్రీ స్క్రీన్‌పై చక్కని రొమాంటిక్ వైబ్‌ను సృష్టించింది. ఈ పాట యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ, సినిమా యొక్క రొమాంటిక్ కామెడీ & సెంటిమెంటల్ జోనర్‌కు సరిగ్గా సరిపోయింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పాటకు స్ఫురణను, లయను అందించి, ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా మలిచింది.

Virgin Boys

లిరిక్స్‌లో పూర్ణ చారి యువత హృదయాలను తాకే సున్నితమైన పదాలను ఎంచుకున్నారు. ఈ పాటలోని దృశ్యాలు రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ నాణ్యమైన నిర్మాణ విలువలను ప్రతిబింబిస్తాయి. ఇవి యువత ఆకర్షణను, ఆధునిక జీవనశైలిని సమర్థవంతంగా చూపించాయి. మొత్తంగా, ‘పెదవుల తడి’ ఒక రిఫ్రెషింగ్, ఎనర్జిటిక్ ట్రాక్ గా రొమాంటిక్ వైబ్‌ను ఇస్తుంది.

నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ..“‘వర్జిన్ బాయ్స్’ యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకి సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని, దాన్ని త్వరలో ప్లాన్ చేస్తామని అన్నారు.

ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్

డైరెక్టర్: దయానంద్
ప్రొడ్యూసర్ : రాజా దరపునేని
బ్యానర్ : రాజ్ గురు ఫిలిమ్స్
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డీఓపి : వెంకట ప్రసాద్
లిరిక్స్- పూర్ణ చారి
సింగర్ – ఆదిత్య ఆర్ కె
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *