Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం గుంటూరు జిల్లాలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Pawan Kalyan:గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ తొలుత అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి, సరస్వతీ మాత విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రతా పరికరాలతో స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్కూల్ ప్రాంగణంలోని పవన్ కల్యాణ్ ఒక మొక్కను నాటి నీరు పోశారు.
Pawan Kalyan:నంబూరు గ్రామంలో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఒక్కొక్కరినీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. వారికి దుస్తులు, ఇతర కానుకలను కూడా అందజేశారు. పరిశుభ్రతకు వారు పాటిస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.