Pawan Kalyan: “రాయలసీమ అంటే ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన నేల.. ఇక్కడి రైతుల్లో ఉండే పట్టుదల మామూలుది కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి అద్భుతాలు సృష్టించే సత్తా ఉన్న నేల ఇది” అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
-
పెట్టుబడుల విభజన:
-
ప్రభుత్వ పెట్టుబడి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నేరుగా రూ.40,352 కోట్లు కేటాయిస్తున్నారు.
- ప్రైవేట్ రంగ భాగస్వామ్యం: పీపీపీ (PPP) పద్ధతిలో వివిధ దిగ్గజ సంస్థల నుంచి రూ.60,000 కోట్ల భారీ ప్రైవేట్ పెట్టుబడులు రాబోతున్నాయి.
-
10 జిల్లాలు – 201 క్లస్టర్లు..
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు తీసుకొచ్చిన ‘పల్లెపండుగ’ కార్యక్రమం ద్వారా గత రెండేళ్ల కాలంలో ఒక్క రాయలసీమలోనే ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను దిగ్విజయంగా పూర్తి చేశామని పవన్ స్పష్టం చేశారు. నీటి వసతి కల్పించి, గ్లోబల్ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే రాయలసీమ రైతాంగం దేశ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
