Pawan Kalyan

Pawan Kalyan: నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు చెన్నైలో పర్యటిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంశంపై తిరువాన్మియూరులోని రామచంద్ర కన్వెన్షన్ హాల్ వేదికగా జరుగుతున్న సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ సదస్సును తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డా. తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర కన్వీనర్‌గా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సెమినార్‌కు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలు, మేధావులు హాజరయ్యారు.

చెన్నై చేరుకున్న పవన్‌కు ఘన స్వాగతం

దీని కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదివారం రాత్రే చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన్ను తమిళిసై సౌందరరాజన్, ఇతర బీజేపీ నేతలు ఘనంగా స్వాగతించారు. అలాగే ఆయన బసచేసిన హోటల్ వద్ద కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్, పలువురు నేతలు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Saraswati River Pushkaram: కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు

ఇటీవలే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉపముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న పవన్, ఆ తరువాతే చెన్నై చేరారు. అప్పటి నుంచి ఆయన పర్యటనకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.

‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై పవన్ అభిప్రాయంపై ఆసక్తి

ఒకే సమయానికి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపాలన్న వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని ఈ సెమినార్‌లో వెల్లడించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ దృక్పథం రాజకీయంగా ఆసక్తికరంగా మారనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *