Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’.. తెలుగు నేలపై ఇదొక సాధారణ పేరు కాదు, అదొక బలమైన భావోద్వేగం! కోట్లాది మంది గుండెచప్పుడు! వెండితెరపై ఆయన కనిపిస్తే పట్టరాని ఉత్సాహంతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ప్రజాక్షేత్రంలో ఆయన గొంతు విప్పితే లక్షలాది మందిలో పోరాట స్ఫూర్తి రగులుకుంటుంది. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో ముప్పైకి మించి సినిమాలు చేయకపోయినా, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఒక ప్రభంజనంగా మారిన ఏకైక నాయకుడు ఆయన. నటుడిగా అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడే భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలేసి, ప్రజాసేవ కోసం ముళ్లబాటను ఎంచుకున్న ధీశాలి. నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆయన బాల్యం, జీవితాన్ని మలుపు తిప్పిన నిజాలు, సినీ వైభవం మరియు సరికొత్త చరిత్ర సృష్టించిన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
చిన్ననాటి జ్ఞాపకాలు – పుస్తకాలు నేర్పిన సత్యం..
బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మూడో కుమారుడిగా జన్మించిన పవన్ అసలు పేరు ‘కళ్యాణ్ కుమార్’. ఇంట్లో ముద్దుగా ‘కళ్యాణ్ బాబు’ అని పిలిచేవారు. చదువుకునే రోజుల్లో ఎవరితోనూ గొడవలు పడటం ఇష్టం లేక, తానొక సూపర్ స్టార్ తమ్ముడినని ఎక్కడా చెప్పుకోలేదు.ఎందుకంటే అలా చెప్పడంవల్ల వచ్చే స్పెషల్ ట్రీట్‌మెంట్ ఆయనకి నచ్చదు.
బాక్సాఫీస్‌ను శాసించిన ‘పవర్ స్టార్’..
అవమానాల కొలిమి నుంచి అసెంబ్లీ వరకు..
డిప్యూటీ సీఎంగా ప్రజా సేవ – అనారోగ్యాన్ని లెక్కచేయని కర్తవ్యదీక్ష..
-
ఒకే రోజు 13,326 గ్రామసభలు:రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి పల్లెల వికాసానికి బాటలు వేశారు.
-
విశ్రాంతి లేని సేవ – ఆయుర్వేద చికిత్స:తీవ్రమైన భుజం నొప్పికి (రోటేటర్ కఫ్) ముంబైలో సర్జరీ చేయించుకున్నప్పటికీ.. విశ్రాంతి తీసుకోకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నొప్పి తిరగబెట్టి జ్వరం రావడంతో, వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్‌లో 20 రోజుల ప్రత్యేక ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు.
ఓటములను చూసి పారిపోకుండా.. వాటినే విజయానికి సోపానాలుగా మలచుకుని, అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకత్వం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరింత ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు!
