PM Modi Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిలువెత్తు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు ఏకంగా ఓ భవ్య దివ్య మందిరాన్ని (ఆలయాన్ని) నిర్మించాలంటూ బీహార్ రాష్ట్ర కిన్నర్ (ట్రాన్స్‌జెండర్) సంక్షేమ బోర్డు సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా తమ సమాజానికి దక్కని హక్కులు, గౌరవం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్లే సాధ్యమయ్యాయని బోర్డు సభ్యులు తెలిపారు. జూలై 29న జరిగిన బోర్డు తొలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించగా, త్వరలోనే ఇది రాష్ట్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌కు చేరనుంది.
ఆలయ ప్రతిపాదన – ప్రధాన ముఖ్యాంశాలు..
మా తలరాత మార్చింది మోదీనే” – కిన్నర్ బోర్డు సభ్యుడు రాజన్ సింగ్..
ప్రభుత్వ సహకారంపై ధీమా..
ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయిస్తుందా అనే ప్రశ్నకు రాజన్ సింగ్ బదులిస్తూ.. ప్రభుత్వం కచ్చితంగా సహకరిస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. మోదీకి కృతజ్ఞతగా, ఆయనను దేవుడిగా భావిస్తూ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
