Bala Krishna

Bala Krishna: చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ

Bala Krishna: ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ గారు సూచించారు

సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు.

కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ గారిని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడం హర్షించదగిన విషయం. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భరత్ భూషణ్ గారిని చైర్మన్ గా నియమించి రాష్ట్రంలో ఈ సంస్థ అభివృద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *