No-Confidence Motion

No-Confidence Motion: రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు

No-Confidence Motion: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. పక్షపాత ధోరణితో సభను నడపడమే కాకుండా ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా ధన్‌ఖర్‌ చేస్తున్నారని నోటీసులో విపక్ష సభ్యులు ఆరోపించారు. ఈ నోటీసులో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ, డీఎంకే, సీపీఐ, సీపీఐ-ఎం, ఆర్జేడీ సహా 60 మంది ఎంపీల సంతకాలు ఉన్నాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ, లోక్‌సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి.

ప్రతిపాదనను రాజ్యసభలో ప్రవేశపెడితే, దానిని ఆమోదించడానికి సాధారణ మెజారిటీ అవసరం, కానీ 243 మంది ఎంపీలతో రాజ్యసభలో ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్య లేదు. డిప్యూటీ చైర్మన్‌ను తొలగించాలంటే లోక్‌సభలో కూడా తీర్మానం చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది, విపక్ష ఇండియా కూటమికి 236 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ 272 వద్ద ఉంది. ఒకవేళ  ప్రతిపక్షం మిగతా 14 మంది సభ్యులను ఒప్పించినా.. తీర్మానాన్ని ఆమోదించడం కష్టం.

ఇది కూడా చదవండి: Today Horoscope: ఈరాశుల వారు వాదనలకు దూరంగా ఉండడం మంచిది.. ఈరోజు రాశిఫలాలు ఇవే!

No-Confidence Motion: ప్రతిపక్షం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షం ఎప్పుడూ ఛైర్మన్ ను  అవమానిస్తుంది. వారు చైర్మన్ హక్కులను అగౌరవపరిచారు. సభలో ఎన్డీయేకు మెజారిటీ ఉంది, చైర్మన్‌పై మాకందరికీ నమ్మకం ఉంది అన్నారు. అదే సమయంలో మంగళవారం 11 గంటలకు ఉభయ సభల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో తొలుత సభ 12 గంటలకు వాయిదా పడింది. 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా అదానీ-జార్జ్ సోరోస్ అంశంపై గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. గందరగోళం కారణంగా రాజ్యసభ కార్యకలాపాలు కూడా బుధవారానికి వాయిదా పడ్డాయి.

ఉపరాష్ట్రపతిని ప్రశంసిస్తూ, ధన్‌ఖర్‌ సాధారణ నేపథ్యం నుండి వచ్చారు. పార్లమెంటు లోపలా, బయటా ఎప్పుడూ రైతులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటారు. అవి మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మేము ఆయనను గౌరవిస్తాము. రాష్ట్రపతిపై మనందరికీ నమ్మకం ఉంది. ఆయన సభకు మార్గనిర్దేశం చేస్తున్న తీరు పట్ల మేము సంతోషిస్తున్నాము అని మంత్రి కిరణ్ రిజీజు వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: రైతుల కండ్ల‌ల్లో క‌న్నీటి సుడులు.. దీపావ‌ళికి వారిండ్ల‌లో చీక‌ట్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *