Ongole: ‘ఇరుముడి’ సినిమాలో స్పెషల్ క్లాసుల పేరుతో అమాయక విద్యార్థినులను మోసగించి, రాజకీయ నాయకుడి వద్దకు పంపించే టీచర్ పాత్ర గుర్తుందా? సరిగ్గా అలాంటి అమానవీయ ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నిజంగా జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. కాకపోతే ఆ సినిమాలో టీచర్ అయితే.. ఇక్కడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) హాస్టల్లో పనిచేసే వంటమనిషే పిల్లలను కాటేసే రాబందులా మారింది. హాస్టల్ విద్యార్థినులను మభ్యపెట్టి ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి పంపించడం, అక్కడ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా పెను దుమారం రేపుతోంది.
అసలు ఏం జరిగింది?
విద్యార్థినులను హాస్టల్ నుంచి అసలు బయటకు ఎందుకు పంపించారు? ఈ వ్యవహారంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? ఇంకా ఎవరైనా మధ్యవర్తులు, సిబ్బంది హస్తం ఉందా అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.కొద్ది నెలల క్రితమే ఓ వ్యక్తి మైనర్ బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి తోటలో లైంగిక దాడికి పాల్పడటం, ఆ తర్వాత నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటన మరువకముందే.. మళ్లీ కేజీబీవీ హాస్టల్ కేంద్రంగా ఇలాంటి దారుణం జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
